
కొకై న్ స్వాధీనం
కృష్ణగిరి: మండల పరిధిలోని హైవే – 44పై అమకతాడు టోల్‌ప్లాజా వద్ద మంగళవారం రాత్రి పోలీసుల తనిఖీలో మాదకద్రవ్యాలు లభ్యమైన విషయం తెలిసిందే.ఈ వ్యవహారంపై బుధవారం పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య, వెల్దుర్తి సీఐ మధుసూదన్‌రావ్ స్థానిక సీఐ కార్యాలయంలో నిందితుడి అరెస్ట్ చూపా రు. డీఎస్పీ, సీఐలు మాట్లాడుతూ.. కృష్ణగిరి ఎస్‌ఐ జి.కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో తనిఖీ చేయగా ప్రయా ణికుడు బెల్లం అఖిల్ చౌదరి వద్ద రూ.80 వేలు విలువైన 10 గ్రాముల కొకై న్ లభించిందన్నారు. ఒంగోలు కు చెందిన అఖిల్‌చౌదరి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసిందని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా డ్రగ్స్ అలవాటు ఉండటంతో బెంగుళూరులోని తన స్నేహితుడి వద్ద నుంచి తీసుకున్నట్లు చెప్పాడన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
అభిషేకం చేయిస్తానని మోసం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేయిస్తానని భక్తుల నుంచి డబ్బులు వసూ లు చేసి మోసగించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై బుధవారం శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు మాట్లాడుతూ.. హైదరాబాదుకు చెందిన 3 కుటుంబాల వారు ఈ నెల 14న శ్రీశైల మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. పవన్ అనే వ్యక్తి వారికి గర్భాలయ అభిషేకం చేయిస్తానని చెప్పి రూ.15 వేలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు దేవస్థానం అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై దేవస్థానం సీఎస్‌ఓ పోలీస్ స్టేషన్‌లో ఫి ర్యాదు చేయగా విచారణ జరిపి నిందితుడిని పట్టుకుని చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
పిడుగుపాటు మృతుల కుటుంబాలకు పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పిడుగుపాటుతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం మంజూరైంది. కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో తెలుగు ఆశోక్ ఏప్రిల్ 27న పిడుగుపాటుకు మరణించాడు. అదే నెల 30న ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామానికి చెందిన కోతిరాళ్ల రవి అలియాస్ బోయరవి పిడుగుపాటుతో మరణించాడు. మరణించిన వీరి కుటుంబాలకు రూ.4 లక్షల ప్రకారం ఎక్స్‌గ్రేషియా మంజూరైంది. కాగా 2024 ఆగస్టు నెలలో కురిసిన అధిక వర్షాలతో దెబ్బతిన్న 47 ఇళ్లకు రూ.1.88 లక్షలు డ్యామేజీ కింద మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.