
మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం
నంద్యాల(వ్యవసాయం): రాజీ అయ్యే కేసులను మధ్యవర్తిత్వం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి అన్నారు. సోమవారం స్థానిక కోర్టు ఆవరణలో బ్యాంకు, ఇన్సురెన్స్ అధికారులకు ‘మీడియేషన్–వన్‌నేషన్’ అనే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ సమయంలో డబ్బు ఆదాతో పాటు కేసులు పరిష్కారమవుతాయని అధికారులకు సూచించారు. మీడియేషన్‌పై శిక్షణ తీసుకున్న సీనియర్ న్యాయవాదులు బ్యాంక్ అధికారులకు, ఇన్సురెన్స్ అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రామచంద్రారావు, అడ్డగాళ్ల వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్‌బాషా, సుబ్బరాయుడు, రామచంద్రారెడ్డి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.