
ఎరువుల దుకాణాలపై దాడులు
నంద్యాల(అర్బన్): పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో వ్యవసాయాధికారులు సోమవారం దాడులు చేశారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు.. రాష్ట్రస్థాయి తనిఖీ బృందంలో భాగంగా కమలాపురం ఏడీఏ నరసింహారెడ్డి, విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణంలా ఆధ్వర్యంలో పట్టణంలోని పలు పురుగు మందు లు, ఎరువుల దుకాణాలతో పాటు విత్తన దుకాణాలు, విత్తనశుద్ధి కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వలు, స్టాక్ రిజిస్టార్లు, అనుమతి పత్రాలను పరిశీలించిన అనంతరం వసువాహిణి ఆగ్రో ఏజెన్సీస్‌లో రూ.84 వేలు, శివసంతోష్‌రెడ్డి ఏజెన్సీస్‌లో రూ.70 వేలు విలువ గల ఎరువులకు సరైన ధ్రువపత్రాలు చూపకపోవడంతో అమ్మకాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఏడీఏ నరసింహారెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వం అనుమతి ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మాత్రమే విక్రయించాలన్నారు.