ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండది మొదటి స్థానం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండది మొదటి స్థానం

Jun 9 2026 8:58 AM | Updated on Jun 9 2026 8:58 AM

మిర్యాలగూడ : యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమస్థానంలో ఉందని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సీజన్‌లో 459 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి.. 96,769 మంది రైతుల నుంచి రూ.1789 కోట్ల విలువైన 7.50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గంలోనే 2.18లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.1570 కోట్లు జమ చేశామని, ఇంకా రూ.190కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మిల్లర్ల నుంచి 22వేల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ బియ్యం సేకరించామన్నారు. యాదాద్రి జిల్లా నుంచి మరో 10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రస్తుతం మిర్యాలగూడ ప్రాంత మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఆయన వెంట ఆర్డీఓ రమణారెడ్డి ఉన్నారు.

ఫ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement
Advertisement