రెండున్నర ఏళ్ల నుంచి ఐదేళ్లలోపు పిల్లల పేర్లు నమోదు చేయించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మమాట–అంగన్‌వాడీ బాట అనే బడిబాట చేపడుతున్నాం. పిల్లలకు పౌష్టకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తాం. బడిఈడు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
– కృష్ణవేణి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్, నల్లగొండ
మిర్యాలగూడ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు ఆట–పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్య అందిస్తోంది. అందులో భాగంగా అంగన్‌వాడీ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెల 15 నుంచి ‘అమ్మమాట – అంగన్‌వాడీ బడిబాట’ పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగుతూ రెండున్నరేళ్ల చిన్నారులను గుర్తించి వారిని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నారు. చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో చేరే విధంగా.. ఐదేళ్లు దాటిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విధంగా కృషి చేస్తున్నారు.
తొమ్మిది ప్రాజెక్టులు
జిల్లాలో తొమ్మిది ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. అనుముల, చింతపల్లి, దామరచర్ల, దేవరకొండ, కొండమల్లేపల్లి, నల్లగొండ, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
భోజనం, బ్రేక్‌ఫాస్ట్ ఒకే దగ్గర అందేలా..
అంగన్‌వాడీకి వచ్చే చిన్నారులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కేంద్రాల్లోనే ఉంటారు. వారికి ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక అందిస్తారు. వీరికి కేంద్రంలోనే బ్రేక్‌ఫాస్ట్‌గా చిరుధాన్యాలతో కూడిన ఉప్మా, మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు గుడ్డు అందివ్వనున్నారు. ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుండడంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఫ 15వ తేదీనుంచి ప్రత్యేక కార్యక్రమం
ఫ రెండున్నరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీల్లో పూర్వప్రాథమిక విద్య
ఫ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించనున్న కార్యకర్తలు
అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు ఇలా..
6 నెలల నుంచి
6 ఏళ్ల లోపు
పిల్లలు
72,474
బాలింతలు 5316


