నకిరేకల్ : రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్తా సమన్వయంతో పని చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏఐసీసీ టైనర్ ఎండీ నూమాన్ అన్నారు. నకిరేకల్ పట్టణంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు అవగాహన కలిగి ఉండి ప్రజలను చైతన్యపరచాలని కోరారు. పార్టీ కోసం అంకితభావంతో పని చేసిన కార్యకర్తలను అధిష్టానం గుర్తించి పదవులు కేటాయిస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత, చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీత, టీపీసీసీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్, నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, బత్తుల ఉశయ్య, లక్ష్మీనర్సు, మల్లారెడ్డి, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాజుల సుకన్య, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్ పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ ట్రైనర్ ఎండీ.నూమాన్


