జూలై చివరి నాటికి ‘నక్ష’ సర్వే పూర్తిచేస్తాం | - | Sakshi
Sakshi News home page

జూలై చివరి నాటికి ‘నక్ష’ సర్వే పూర్తిచేస్తాం

Jun 9 2026 8:58 AM | Updated on Jun 9 2026 8:58 AM

మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో చేపట్టిన ‘నక్ష సర్వే’ను జూలై చివరి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. నక్ష సర్వేకు పైలట్‌ పథకం కింద ఎంపికై న మున్సిపాలిటీల్లో సర్వే పురోగతిపై సోమవారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు కలెక్టర్లతో ప్రత్యేక వీడియో కాన్ఫ్‌రెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ పైలట్‌ ప్రాజెక్టు కింద మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎంపికై ందని ఇందులో ఇండ్లు, భవనాలు, ఖాళీ స్థలాల కచ్చితమైన మ్యాపింగ్‌ కోసం సర్వే వేగంగా జరుగుతుందన్నారు. సమాచారాన్ని డిజిటలైజ్‌ చేసేందుకు మొత్తం 32 వార్డులను ఏర్పాటు చేశామని, ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలన కోసం 356 బ్లాకులు, 43 వ్యవసాయ బ్లాకులు, 313 భవనాల బ్లాకులుగా విభజించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 25వేల ఆస్తులను గుర్తించగా క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతర శ్రమతో ఇప్పటివరకు 9,375 ఆస్తులకు సంబంధించిన డిజిటల్‌ సర్వేను పూర్తి చేసి రికార్డు స్థాయిలో 37శాతం ప్రగతిని సాధించినట్లు వెల్లడించారు. ఇప్పటికే ఆరు వార్డుల సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. సర్వే నిర్వహణకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. భూములు, ఇళ్ల సమగ్ర మ్యాపింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు మొత్తంగా 14 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను రంగంలోకి దించినట్లు కలెక్టర్‌ వివరించారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement