బీజేపీని బలోపేతం చేయాలి
బూత్ స్థాయి నుంచే బీజేపీని బలోపేతం చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.
వాతావరణం
పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
- 8లో
కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పశువుల సంత ఆదివారం కిక్కిరిసిపోయింది. రైతులు సాగు పనులు ప్రారంభించడం, రోహిణి కార్తె పూర్తయి.. మృగశిర కార్తె రావడం, వర్షాలు కురస్తుండడంతో రైతులు పత్తి విత్తనాలు వేసేందుకు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. రైతులు ఎక్కువగా అరకదున్నే ఎద్దుల కొనుగోలు చేసి పంట చేలు పూర్తయ్యాక వాటిని తిరిగి అమ్ముతుంటారు. అందులో భాగంగానే ప్రతి వేసవికాలంలో మృగశిర కార్తె ముగింపు వరకు పశువుల క్రయ విక్రయాలు కొండమల్లేపల్లిలో ఎక్కువగా జరుగుతాయి. ఆదివారం అరక దున్నే ఎద్దుల క్రయవిక్రయాలు పెద్ద ఎత్తున సాగాయి. సంతలో జత ఎద్దులకు రూ.లక్ష నుంచి రూ.1.50లక్ష వరకు ధర ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు.


