భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న థ్రెడ్. పోచంపల్లి చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పాల్గొని ఎగ్జిబిషన్‌లో స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత కళాకారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా చేనేత కార్మికులకు ఉపాధి, మార్కెటింగ్ కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన పోచంపల్లి ఇక్కత్‌కు దేశ, విదేశాల్లో మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు. డీఆర్‌డీఓ నాగిరెడ్డి, అదనపు డీఆర్‌డీఓ కోట జంగారెడ్డి, భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం గోవర్ధన్, గజం అంజయ్య, పోచంపల్లి మున్సిపల్‌చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, టైఅండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ సీఈఓ తడక రమేశ్, భారత లవకుమార్, ఈపూరి ముత్యాలు, దోర్నాల శేషగిరి, ఎన్నం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


