విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తా

Jun 8 2026 9:53 AM | Updated on Jun 8 2026 9:53 AM

నల్లగొండ టౌన్‌ : విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కాసోజు శంకరమ్మ అన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు తన కుమారుడు దివంగత కాసోజు శ్రీకాంతాచారి సమాజంలో చిరస్మరనీయుడన్నారు. తనను గౌరవించేలా అభినందన సభ ఏర్పాటు చేసిన సేవా సంస్థకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమెను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోట సోము, జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరిచారి, విశ్వనాథం, సత్యనారాయణ, రమణాచారి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నరేంద్రబాబు, శోభారాణి, రఘువీర్‌ ప్రతాప్‌, షణ్ముఖచారి పాల్గొన్నారు.

ఫ తెలంగాణ మహిళా కమిషన్‌

సభ్యురాలు కాసోజు శంకరమ్మ

Advertisement
 
Advertisement
Advertisement