కానరాని భూ విలువలు
కమర్షియల్ స్థలాలకు
పెరిగిన విలువలు ఇలా.. (రూ.లలో/గజం)
పాత ధర
కొత్త ధర
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలోని నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడలో భూ విలువలు భారీగా పెరిగాయి. జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఈ రెండు ప్రాంతాల్లోనే ధరలు అత్యధికంగా ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడలో కమర్షియల్ ప్లాట్లు గతంలో గజానికి రూ.31,800 ఉండగా ప్రస్తుతం అది 40,700 (21.86 శాతం) పెరిగింది. ఈ రెండు పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల విలువల కూడా భారీగా పెరిగింది. ప్రాంతాల వారీగా వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, కమర్షియల్ ప్లాట్ల విలువలను సమరించింది. సవరించిన విలువలను శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కనిష్టంగా 15 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెంపు ఉండడంతో ప్రజలపై భారం పడుతోంది.
హాలియాలో ఎకరం రూ.80 లక్షలు..
వ్యవసాయ భూములకు సంబంధించి జిల్లాలో హాలియాలో ఎకరానికి కనిష్టంగా రూ.5 లక్షలు ఉండగా.. హైవే వెంట రూ.80 లక్షలకు పెరిగింది. మునుగోడులో కనిష్టంగా రూ.4.50 లక్షలు ఉండగా అత్యధికంగా 6.75 లక్షలు ఉంది. పెద్దవూరలో అత్యధికంగా రూ.55 లక్షలు ఉండగా తక్కువగా రూ.5 లక్షల వరకు ఉంది. నిడమనూరులో తక్కువగా రూ.5,11,875 ఉండగా ఎక్కువగా రూ.8,58,375 లక్షలకు పెరిగింది. చిట్యాలలో హైవే వెంట వట్టిమర్తి వద్ద రూ.63 లక్షలకు పెరగగా.. ఎలికట్టెలో రూ.5.40 లక్షలుగా ఉంది. కొండమల్లేపల్లిలో అతి తక్కువగా రూ.4.50 లక్షలు ఉండగా.. అత్యధికంగా రూ.76 లక్షలకు పెరిగింది. వేములపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ ఇటిక్యాలలో రూ.30,50,200 ఉండగా.. తక్కువ చలిచీమలపాలెంలో రూ.6,75,000 ఉంది. నాంపల్లి మండలంలో అత్యధిక భూమి విలువ తక్కువగా రూ.3,36,500 అత్యధికంగా రూ.16,33,500 ఉంది. చండూరు మండలంలోని చండూరులో గరిష్టంగా రూ.63,52,500 కాగా.. తక్కువగా కొండాపురంలో రూ.3,93,750గా ఉంది.
అపార్ట్‌మెంట్ల విలువ పెరిగిందిలా..
నల్లగొండ నగరంతో పాటు మిర్యాలగూడ పట్టణంలో అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగుల విస్తీర్ణం ధరలు భారీగా పెరిగాయి. గతంలోకంటే ప్రాంతాన్ని బట్టి 20 శాతం నుంచి 50 శాతానికిపైగా పెంచింది. నల్లగొండలోని ప్రకాశం బజార్‌లో అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు మార్కెట్ విలువ గరిష్టంగా రూ.3 వేలకు పెంచగా, శివాజినగర్‌లో రూ.1,800లకు పెంచింది. మిర్యాలగూడలోనూ పోలీస్‌స్టేషన్ నుంచి ఓల్డ్ ఎంఆర్వో రోడ్‌లో కనిష్టంగా రూ.1800 చేయగా, మున్సిపల్ కాంప్లెక్స్ నుంచి బ్రిడ్జి రోడ్డులో గరిష్టంగా రూ.3400లకు పెంచింది
ఇళ్ల స్థలాల విలువలు భారీగా పెంపు..
● నల్లగొండలో రెసిడెన్షియల్ విభాగంలో రూ.1,700 ఉన్న చోట రూ.2,600కు, రూ.2,400 నుంచి రూ.4,200కు పెంచారు. బొట్టుగూడలో రూ.2,400 నుంచి రూ.4,800కు, చర్లపల్లిలో రూ.3,100 నుంచి రూ.5,425కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో గజానికి రూ.500 ఉన్న విలువను రూ.900కు పెంచారు.
● మిర్యాలగూడ మండలంలో గతంలో గజం ధర రూ.500 ఉండగా.. రూ.900కు పెంచారు.
● చింతపల్లి హైవే వెంట గజానికి రూ.4200, కనిష్టంగా ముస్లింవాడలో రూ.1600 ఉంది.
● మర్రిగూడలో హైదరాబాద్ రోడ్డులో గరిష్టంగా గజానికి రూ.2600 కాగా, కనిష్టంగా పడమటి వాడలో రూ.1500గా ఉంది.
ప్రకాశం బజార్
31,800
40,700
4,100
మిర్యాలగూడ రోడ్డు
6,000
10,000
వెంకటేశ్వర కాలనీ
16,200
గడియారం–రామగిరి మార్గం
17,600
26,000
దేవరకొండ
మెయిన్ రోడ్డు
5,800
27,100
3,100
అశోక్‌నగర్
5,500
ఫ 15 శాతం నుంచి 100 శాతం వరకు విలువల పెంపు
ఫ ప్రాంతాల వారీగా సవరణ
ఫ ప్రభుత్వానికి ఆదాయం.. జనంపై భారం
వ్యవసాయ భూములకు సంబంధించి కొన్ని సర్వే నంబర్లకు మార్కెట్ విలువ చూపించడం లేదు. మిర్యాలగూడ మండల పరిధిలోని జప్తి వీరప్పగూడెంలో సర్వేనంబర్ 157లో, కాల్వపల్లిలో సర్వేనంబర్ 1, తడకమళ్లలో సర్వేనంబర్ 15, మిర్యాలగూడ శివారులో సర్వే నంబర్ 110 ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి విలువ రూ.0 గా చూపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూముల విలువ పూర్తిస్థాయిలో అప్‌డేట్ కాకపోవడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది.


