గుట్టను 20 మీటర్లు తవ్వడమెందుకు? | - | Sakshi
Sakshi News home page

గుట్టను 20 మీటర్లు తవ్వడమెందుకు?

Jun 7 2026 9:06 AM | Updated on Jun 7 2026 9:06 AM

నల్లగొండ టూటౌన్‌ : బ్రహ్మంగారి, లతీఫ్‌ సాహెబ్‌ గుట్టలపై ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి గుట్టను 20 మీటర్ల లోతు ఎందుకు తవ్వుతున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. గుప్త నిధుల కోసం తవ్వుతున్నారనే అనుమానం స్థానికులు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. నల్లగొండ నగరంలోని గుట్టలపై జరుగుతున్న బ్లాస్టింగ్‌ కారణంగా మునుగోడు హౌసింగ్‌బోర్డులో రాళ్లు పడి దెబ్బతిన్న ఇళ్లన్నాయన పరిశీలించారు. పేలుళ్ల వల్ల పెద్ద, పెద్ద రాళ్లు వచ్చి తమ నివాసాలపై పడడంతో స్లాబ్‌ పెచ్చులు ఊడి పడినట్లు స్థానికులు భూపాల్‌రెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో ఉన్న మహిళలు, పిల్లలు భయబ్రాంతులకు గురయ్యే విధంగా గుట్టలపై పేళుల్లు జరుపడం ఎంటని ప్రశ్నించారు. పేళుళ్ల దాటికి స్లాబ్‌లకు రంద్రాలు పడుతున్నా అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు, కాంట్రాక్టర్‌ బాధ్యత లేకుండా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నివాస పాంత్రాలలో బ్లాస్టింగ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఘాట్‌రోడ్డు నిర్మాణానికి డీపీఆర్‌, టెండర్‌ ప్రక్రియ ఉందో లేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ హయాంలో మంజూరు చేసిన నిధులతో కాంగ్రెస్‌ నాయకులకు వెంచర్లు ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నాణ్యత లేకుండా వేసుకుంటున్నారని వివర్శించారు. వీటన్నింటిపై విచారణ జరిపి, బ్లాస్టింగ్‌ జరిపిన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని, నష్టపోయిన ఇళ్లకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌, కార్పొరేటర్లు పెరిక యాదయ్య, బాణావత్‌ దీప్లా, నాయకులు మారగోని గణేష్‌, పెరిక కరణ్‌జయరాజ్‌, కుందూరు ప్రవీణ్‌రెడ్డి, గోపగాని రాజశేఖర్‌, దోటి శ్రీనివాస్‌, దండెంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

ఫ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

ఫ బ్లాస్టింగ్‌ వల్ల దెబ్బతిన్న ఇళ్ల పరిశీలన

Advertisement
 
Advertisement
Advertisement