కట్టంగూర్ : గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. శనివారం అయిటిపాముల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామసభకు దృష్టికి తీసుకొస్తే అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ బోనగిరి రమేష్, సర్పంచ్ బెల్లి సుధాకర్, పంచాయతీ కార్యదర్శి అనిల్ తదితరులు ఉన్నారు.


