సాగర్‌ పర్యాటకాభివృద్ధికి ఊతం | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ పర్యాటకాభివృద్ధికి ఊతం

Jun 6 2026 1:41 AM | Updated on Jun 6 2026 1:41 AM

నాగార్జునసాగర్‌ : సాగర్‌ జలాశయతీరంలో మూడు పంట్ల నిర్మాణం పనులు చేపట్టారు. వీటి నిర్మాణానికి సుమారుగా రూ.4 కోట్లు ఖర్చు కానుంది. కాంట్రాక్ట్‌ సంస్థ సాగర్‌ తీరంలోనే బస చేస్తూ పంట్ల పనులు చేపడుతోంది. 6 మీటర్ల వెడల్పు, 24 మీటర్ల పొడవతో పంట్లను తయారు చేస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఇంజన్లు కూడా అమర్చనున్నారు. వీటిపై కార్లు, జేసీబీ తదితర యంత్రాలను తరలించవచ్చు. ప్రస్తుతం వీటిని లాంచీల వద్ద పర్యాటకులు దిగేందుకు వినియోగించనున్నారు. కొత్తగా తయారు చేసే మూడు పంట్లలో ఒకటి సోమశిలకు పంపనున్నారు. సాగర్‌లో ఉండే రెండింటిలో ఒకటి నాగార్జునకొండలో, మరొకటి ఇక్కడ తీరంలోనే ఉంటుందని పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement