ఆర్టీసీని విలీనం చేసేంత వరకు ఉద్యమిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని విలీనం చేసేంత వరకు ఉద్యమిస్తాం

Jun 6 2026 1:41 AM | Updated on Jun 6 2026 1:41 AM

మిర్యాలగూడ టౌన్‌ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం విలీనం చేసేంత వరకు ఉద్యమం ఆగదని ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఎన్‌ఎస్‌పీ క్యాంపులోని బీసీ భవనంలో మిర్యాలగూడ ఆర్టీసీ డిపో ఎంప్లాయిస్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, 11శాతం పీఆర్‌సీతో 2021 వేతన సవరణ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అన్నీ సంఘాలు మూడు ఆప్షన్లు రాసి ఇచ్చాయని తెలిపారు.

టీఎంయూ నుంచి భారీగా చేరికలు

మిర్యాలగూడ ఆర్టీసీ డీపోకు చెందిన తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ (టీఎంయూ)కు చెందిన సోమయ్య, డికె రెడ్డి, హనుమంతు, వెంగల్‌రెడ్డి, మహేష్‌, శ్రీను, లక్ష్మయ్య, దుర్గయ్య, రమేష్‌, టిజిరెడ్డి నాయకత్వంలో ఉద్యోగులు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌లో చేరారు. సమావేశంలో యూనియన్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శులు రాఘవులు, కెఎస్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బాసా ని వెంకటయ్య, తన్నీరు పాండురంగయ్య, ప్రచార కార్యదర్శి మనోహర్‌, హైదరాబాద్‌ జోనల్‌ నాయకులు టీఎస్‌ రెడ్డి, రీజియన్‌ కార్యదర్శి ఎన్‌ఆర్‌సి.రాజు, నాయకులు ఎండీ.జాబీర్‌, కెవీ రెడ్డి, మహేందర్‌, కోటయ్య, సైదులు, బిజి.రావు, తదితరులు ఉన్నారు.

ఫ ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న

Advertisement
 
Advertisement
Advertisement