నల్లగొండ : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాన్ని పరిశీలించి మాట్లాడారు. డబుల్‌బెడ్ రూమ్‌ఇళ్లలో అద్దాలు, ఎలక్ట్రికల్ వైరింగ్, విండోలు, వాటర్ ట్యాంకులు, నీటి ట్యాపులు, లైటింగ్, తలుపులు, బాత్రూమ్‌లు, టాయిలెట్లు, కిచెన్లు తదితర పనులను పూర్తిస్థాయిలో చేయాలన్నారు. సముదాయంలో ఓపెన్ జిమ్, పార్కులు, బస్తీ దవాఖాన, అంగన్‌వాడీ కేంద్రం, జిరాక్స్ సెంటర్, మీ సేవ కేంద్రం, మెడికల్ షాప్, కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్‌ను ఆదేశించారు. సీసీ రోడ్లు, అంతర్గత రహదారులు, వైకుంఠధామం, క్రీడా మైదానం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, కార్పొరేషన్ కమిషనర్ శరత్‌చంద్ర, కాంట్రాక్టర్ సైదిరెడ్డి, అధికారులు ఉన్నారు.
ఈవీఎం గోదాము పరిశీలించిన
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) భద్రపరిచిన గోదాంను కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. కలెక్టరేట్ ఆవరణలోని గోదాంను ఆయన.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆయా పార్టీల రాజకీయ ప్రతినిధుల ఎదురుగా తెరిపించారు. గోదాంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ఫ్యాట్‌లను పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచే గోదాములో మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తనిఖీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ దశరథ్‌నాయక్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ బి.చంద్రశేఖర్


