శాలిగౌరారం : ఉమ్మడి జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలి గౌరారం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని సూర్యాపేట జిల్లా నీటిపారుదలశాఖ సీఈ నాగభూషణరావు అన్నా రు. శాలిగౌరారం ప్రాజెక్టులోకి ప్రస్తుతం మూసీనది ఎగువ భాగం నుంచి రాచకాల్వ ద్వారా వరదనీరు వచ్చిచేరుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ప్రాజెక్టుతోపాటు రాచకాల్వ, మూసీనదిపై రామన్నపేట మండలం పల్లివాడ వద్ద గల హెడ్‌రెగ్యులేటర్‌లను పరిశీలించారు. ధ్వంసమైన షట్టర్ల నుంచి నీటి వృథాను అరికడతామన్నారు. రాచకాల్వను పూర్తిస్థాయిలో సీసీ లైనింగ్ చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతామన్నారు. పల్లివాడ హెడ్‌రెగ్యూలేటర్ వద్ద నీరు వృథా కాంకుడా నేరుగా ప్రాజెక్టులోకి వచ్చేలా చేరేలా చర్యలు చేపడతామన్నారు. ఆయనవెంట నీటిపారుదలశాఖ ఎస్‌ఈ శివధర్మతేజ, ఈఈ సత్యనారాయణ, ఏఈ విక్రమ్, చామల వెంకటరమణారెడ్డి, సిబ్బంది, రైతులు ఉన్నారు.


