బోర్డు సరే.. రోడ్ల సంగతేంటి? | - | Sakshi
Sakshi News home page

బోర్డు సరే.. రోడ్ల సంగతేంటి?

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

కళ్లుండీ చూడలేని నీటిపారుదల శాఖ

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు, రియల్టర్లు ఒక్కటయ్యారు. రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అధికారులే రియల్టర్లకు కట్టబెట్టారు. నల్లగొండ నగరం పరిధిలోని గిరకబాయగూడెంలో రైతుల భూములకు దారి పేరుతో ప్రైవేటు వెంచర్‌కు ప్రభుత్వ భూమిని మూడు చోట్ల అప్పనంగా ఇచ్చేశారు. అంతేకాదు ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తులే ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి మరీ భూమిని కబ్జా చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో ఫెన్సింగ్‌ తొలగించారు. తాజాగా బోర్డులను ఏర్పాటు చేశారు తప్ప అక్రమంగా కట్టబెట్టిన ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. అక్కడున్న భూమి ఏఎంఆర్‌పి ఎస్‌ఎల్‌బీసీకి చెందినదిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు తప్ప అదే భూమిలో మూడు చోట్ల రియల్టర్లు వేసిన రోడ్లను మాత్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ భూములకు కస్టోడియన్‌గా ఉన్న రెవెన్యూ శాఖ కూడా దీనిపై నోరెత్తకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలోని ఏ శాఖకు చెందిన భూములు కబ్జా అయినా ఫైనల్‌గా పర్యవేక్షించి, తగిన చర్యలు చేపట్టాల్సిన జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని గాలికి వదిలేసింది.

గజానికి రూ.20వేల పైనే

ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజానికి రూ.20 వేలు పలుకుతోంది. ఈ లెక్కన బాట కోసం మూడు చోట్ల 2వేల గజాలకు పైగా స్థలం ఆక్రమణకు గురైంది. ప్రస్తుతం బాట కోసం ఆక్రమించిన ఆ ప్రభుత్వ భూమి విలువ రూ.4 కోట్లకుపైనే ఉంటుంది. పైగా ప్రభుత్వ భూమికి వెనుకాల ఉన్న రైతుల పేరుతో 20 ఏళ్ల తరువాత తమ భూముల్లోకి వెళ్లేందుకు బాట కాావాలని అడిగిందే తడవుగా దానిని ధారాదత్తం చేసేశారు.

రైతులకు బాట కోసం ఇవ్వాల్సిందెంత?

నిజంగా రైతులకే ఇవ్వాల్సి వస్తే ఒక చోట, అదీ బండ్ల బాట వెడల్పుతో ఇస్తారు. అంతే తప్ప వెంచర్‌ కోసం ఈ స్థాయిలో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ శాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. దీనిపై శ్రీసాక్ష్ఙి ప్రచురించిన వరుస కథనాల నేపథ్యంలో ప్రభుత్వ భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించగా, తాజాగా ఏఎంఆర్‌ ఎస్‌ఎల్‌బీసీ భూములంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.

ఫ భూమి తమదేనని బోర్డులు పెట్టిన నీటి పారుదల శాఖ

ఫ వెంచర్‌కు మూడు చోట్ల రోడ్లకు ప్రభుత్వ భూమి ధారాదత్తం

ఫ వాటిని పట్టించుకోని ఇరిగేషన్‌ అధికారులు

ఫ కబ్జా అయిన భూమి విలువ రూ.4 కోట్లు

జిల్లాలో 2004–05లో ఏఎంఆర్‌పి ప్రధాన కాలువను తవ్వే సమయంలో.. భవిష్యత్తు అవసరాల కోసం గిరకబాయిగూడెం వద్ద కొంత భూమి సేకరించారు. ఆ భూమి ఆక్రమణకు గురైనా నీటి పారుదల శాఖ పట్టించుకోలేదు. భూసేకరణ సమయంలో ఆ భూమిని ఇచ్చిన రైతుల పేరుతో ఓ దరఖాస్తును పెట్టించి మూడు చోట్ల ప్రభుత్వ భూమిలో నుంచి 30 అడుగుల వెడల్పుతో దాదాపు వంద మీటర్ల పొడవునా మూడు చోట్ల దారులను ఏర్పాటు చేస్తే కనీసం స్పందించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement