రిసోర్స్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగకరం | - | Sakshi
Sakshi News home page

రిసోర్స్‌ సెంటర్‌ ఎంతో ఉపయోగకరం

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

చండూరు: జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్సీ నెల్లింకంటి సత్యం అన్నారు. గురువారం చండూరు మండల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జెండర్‌ రిసోర్స్‌ సెంటర్‌లో మండలంలోని మహిళలకు కుటుంబ కలహాలు, లేదా ఇతర సమస్యలపై ప్రతి మంగళవారం, శుక్రవారం మండల సమాఖ్య ప్రతినిధులతో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం భార్యాభర్తల మధ్య కలహాలు పరిపాటిగా మారాయని, వాటిని సులువుగా తీర్చేందుకు ఈ సెంటర్‌ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కోడి శ్రీనివాసులు, కౌన్సిలర్‌ కటకం రమేష్‌, మండల సమాఖ్య ప్రతినిదులు, ఏపీఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

నార్కట్‌పల్లి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీసీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెత్త వేరు చేయడం, చెట్లను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జెర్రిపోతుల భరత్‌ కుమార్‌, మండల పరిషత్‌ ప్రత్యేక అధికారి శ్రీనివాసన్‌, ఎంపీడీఓ ఉమేష్‌, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గౌతమ్‌, ఉప సర్పంచ్‌ శిరీష, వడ్డే గోని రామలింగం, పర్రెపాటి సైదులు, ఆమనగంటి ఐలయ్య, జిల్లా మహేష్‌, మేడబోయిన రాంబాబు పాల్గొన్నారు.

జల వనరులను సంరక్షించుకోవాలి

చిట్యాల: గ్రామాల్లో భూగర్భ జల వనరులను సంరక్షించేందుకు కృషి చేయాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి కోరారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో గురువారం జలశక్తి ఆభియాన్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జల సంచాయ్‌– జన్‌భాగి దారి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎత్తైన ప్రాంతాల్లో చెక్‌డ్యాంల నిర్మాణాలు, వాలు కట్టల వంటి నిర్మాణాలు ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా కళాజాత బృందంతో నీటి సంరక్షణపై ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఓ వనం శ్రీలత, ఎంపీఓ కోటేష్‌, సర్పంచ్‌ సాగర్ల భానుశ్రీభిక్షం, ఉపసర్పంచ్‌ ఉయ్యాల నరేష్‌, ఏఎంసీ డైరెక్టర్‌ కోనేటి యాదగిరి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఝాన్సీ, ఫీల్ట్‌ అసిస్టెంట్‌ మర్రి రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement