రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి

Jun 5 2026 4:41 AM | Updated on Jun 5 2026 4:41 AM

అమ్మపేరుతో మొక్కలు నాటాలి

నల్లగొండ: నల్లగొండ ఏఎంఆర్పీ హైలెవెల్‌ కెనాల్‌ లైనింగ్‌ పనుల అమలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధికారులకు సూచించారు. గురువారం కనగల్‌ మండలంలోని రేగట్టె గ్రామం వద్ద ఏఎంఆర్‌పీ కెనాల్‌ లైనింగ్‌ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కంపల్లి నుంచి మూసీ వరకు సుమారు 67 కిలోమీటర్ల మేర కెనాల్‌ లైనింగ్‌ పనులు జరుగుతున్నాయని, ఈ పనులు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ వెంట ఈఈ నెహ్రూనాయక్‌, ప్రాజెక్టు మేనేజర్‌ అభిషేక్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జితేందర్‌, డీఈ సంపత్‌, సంబంధిత అధికారులు ఉన్నారు.

చండూరు: ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. చండూరు మండలంలోని బంగారిగడ్డ గ్రామంలో సర్పంచ్‌ బోయపల్లి సునీత అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మొక్క నాటి, నర్సరీని పరిశీలించారు. ప్లాస్టిక్‌ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శంకర్‌నాయక్‌, వ్యవసాయ శాఖ ఏడీ వేణుగోపాల్‌, ఎంపీడీఓ యాదగిరి, ఎంఈఓ సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమాకాంత్‌శర్మ, ఉపసర్పంచ్‌ మహబూబ్‌, వార్డుసభ్యులు, ఇన్‌చార్జ్‌ ఎంపీఓ కోటయ్య, వివిధ శాఖల ఏఈలు, మండల అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement