పనిచేసే నాయకులకు ఓటు వేయాలి
మిర్యాలగూడ : పనిచేసే నాయకులకు ఓటర్లు ఓటు వేయాలని, నిజమైన ప్రజా సేవకులను ఎన్నుకోవాలని, వామపక్ష ప్రజాతంత్ర లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. సోమవారం మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొస్తూ గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలన్నారు. గ్రామాల ప్రతిష్ట పెంచే సీపీఎం అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎక్కువ చోట్ల ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, కొన్నిచోట్ల పొత్తులు పెట్టుకున్నామని తెలిపారు. సమావేశంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, నాయకుల వీరేపల్లి వెంకటేశ్వర్లు, పాదూరి శశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్, రాగిరెడ్డి మంగారెడ్డి, గోవింద్‌రెడ్డి, దయానంద్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.


