వేప చెట్లకు ౖవెరస్ తీవ్రం
నల్లగొండ టౌన్ : వేపచెట్లకు డైబ్యాక్ వైరస్ సోకుతోంది. ఫోమోప్సిస్ అజడైరక్టియా అనే శీలింద్రం కారణంగా డైబ్యాక్ వైరస్ వేపచెట్లకు ప్రబలుతుంది. మూడు సంవత్సరాల క్రితం కూడా జిల్లాలోని వేపచెట్లకు డైబ్యాక్ వైరస్ సోకి వేలాది వేపచెట్లు చనిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ వేపచెట్లు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద వేపచెట్లు ఈ వైరస్ బారిన పడి ఎండిపోతున్నాయి. వ్యాధి సోకిన చెట్లలో వేపగింజల ఉత్పిత్తి, చెట్లు పెరుగుదల తగ్గిపోతుంది.
గాలి ద్వారా వ్యాధి వ్యాప్తి
డై బ్యాక్ వైరస్ సోకిన చెట్లకు ముందుగా కొమ్మల చివరని ఆకులు ఎండిపోయి తరువాత కొమ్ములు పసుపు రంగులోకి మారిపోతాయి. కొత్త చిగుర్లు రాకుండా ఎండుతాయి. తరువాత చెట్టు మొత్తానికి వ్యాపించి పూర్తిగా ఎండిపోతోంది. వ్యాధి సోకిన చెట్ల కాండంపై అండాకార గాఢ గోదుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ వైరస్ గాలిద్వారా వ్యాప్తి చెందుతుంది. గాయపడ్డ కొమ్మల ద్వారా శిలీంద్రం ప్రవేశించి వైరస్ తీవ్రతను పెంచుతుంది. జిల్లాలోని లక్షలాది వేపచెట్లు ఈ డైబ్యాక్ వైరస్ బారిన పడి ఎండిపోతున్నాయి. దీంతో అటవీ అభివృద్ధి తగ్గిపోయే ప్రమాదం ఉంది.
నియంత్రణ చర్యలు ఇలా..
పురోగతిలో ఉండి ఎండిపోతున్న కొమ్మలను కత్తిరించి ధ్వంసం చేయాలి. కత్తిరించిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 0.3 శాతం లేదా మాంకోజెట్ 0.2శాతం ద్రావణాన్ని చల్లాలి.చెట్టుచెట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నియంత్రణ చర్యలు తీసుకోకపో తే జిల్లా అంతటా వేపచెట్లకు నష్టం జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఫ శిలీంద్రం ద్వారా డైబ్యాక్ వైరస్ వ్యాప్తి
ఫ జిల్లా అంతటా ఎండుతున్న వేప చెట్లు


