సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
కనగల్ : పంచాయతీ ఎన్నికల సందర్భంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. సోమవారం రాత్రి కనగల్ మండలంలోని జి.ఎడవెల్లిలో ఎన్నికల నియమావళిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ యంత్రాంగం పని చేస్తోందన్నారు. ఎవరైనా గొడవలకు కారకులు అయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, ప్రజలు నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలు, ధర్నాలు చేయడం నిషేధమన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరూ ఓటర్లను ప్రలోభపెట్టే మద్యం, నగదు పంపిణీ చేయొద్దని పేర్కొన్నారు. ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగంచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, చండూరు సీఐ ఆదిరెడ్డి, కనగల్ ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి, ప్రశాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
హోంగార్డుల సంక్షేమానికి కృషి
నల్లగొండ : హోంగార్డుల సంక్షేమానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డు సిబ్బందికి ఏర్పాటు చేసిన పోలీస్ దర్బార్‌లో ఆయన మాట్లాడారు. 1946 డిసెంబర్ 6న స్వచ్ఛందంగా ప్రారంభమైన హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీసు శాఖలో భాగమై శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, నేర సంబంధిత విధుల నిర్వహణలో సమర్థంగా పని చేయడం అభినందనీయమన్నారు. హోంగార్డ్ సిబ్బంది సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరు తమకు అప్పగించిన విధులను క్రమశిక్షణ, అంకిత భావంతో నిర్వహించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు మల్లారెడ్డి, శ్రీనివాసులు, ఎస్‌బీ సీఐ రాము, ఆర్‌ఐలు శ్రీను, సంతోష్, సూరపునాయుడు, ఆర్ ఎస్‌ఐ శ్రావణి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


