
బైక్‌కు నిప్పంటించిన దుండగులు
అడవిదేవులపల్లి: గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌కు నిప్పంటించారు. ఈ ఘటన అడవిదేవులపల్లి మండల కేంద్రంలో జరిగింది. అడవిదేవులపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్దండి కోటయ్య తన బైక్‌ను మంగళవారం రాత్రి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. బుధవారం ఉదయం లేచి చూడగా బైక్ కనిపించలేదు. గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో బైక్ దగ్ధమవుతుండటం గమనించిన గ్రామస్తులు కోటయ్యకు సమాచారం ఇచ్చారు. కోటయ్య వెళ్లి చూడగా.. బైక్‌కు నిప్పంటించినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శేఖర్ తెలిపారు.