కుక్కల దాడిలో జింక మృతి | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో జింక మృతి

Published Tue, Apr 16 2024 1:55 AM

నెమిలలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ  - Sakshi

మర్రిగూడ: కుక్కల దాడిలో జింక మృతిచెందింది. వివరాలు.. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామ సమీపంలో సంచరిస్తున్న జింకపై సోమవారం వీధి కుక్కలు దాడి 15సీపీఎల్‌ 803– గాయపడిన జింకకు వైద్యం చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ ఎల్లేష్‌ చేసి గాయపర్చాయి. అదే సమయంలో అటుగా ఉపాధి పనులకు వెళ్తున్న గ్రామస్తులు గమనించి ఎంఎస్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లా తిరుమలేష్‌కు విషయం తెలుపగా.. ఆయన స్థానిక పోలీసులకు, సంబంధిత ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చి, ఓ ప్రైవేట్‌ వాహనంలో గ్రామస్తులు సహాయంతో జింకను మర్రిగూడ పశువైద్యశాలకు తీసుకొచ్చారు. జింక ముందు ఎడమ కాలు, వెనుక కుడి కాలుకు తీవ్రంగా గాయాలు కాగా.. వెటర్నరీ అసిస్టెంట్‌ ఎల్లేష్‌ జింకకు వైద్యం అందించినప్పటికీ అది మృతిచెందింది. ఈ మేరకు పంచనామా నిర్వహించి కమ్మగూడలో జింకను ఖననం చేసినట్లు అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ ఎన్‌. నవీన్‌ తెలిపారు.

వసతి గృహం సిబ్బందిపై కేసు నమోదు

భువనగిరి క్రైం: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. భువనగిరి మండలంలోని బొల్లెపల్లికి చెందిన ఏడో తరగతి విద్యార్థి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వసతి గృహ సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులైన అధికారులు, సిబ్బంది పైన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమంలో ఫ్లెక్సీ వైరల్‌

రాజాపేట : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రచారానికి విచ్చేసే నాయకులకు తమ డిమాండ్లను తెలు పుతూ రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ‘మాకు పనికిమాలిన ఉచిత పథకాలు వద్దు’, ‘అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు కావాలి’ వంటి పలు డిమాండ్లతో కూడిన ఫ్లెక్సీని నెమిల గ్రామ స్టేజీ వద్ద నాలుగు రోజుల క్రితం గ్రామస్తులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాగా ఈ ఫ్లెక్సీని వెంటనే ఎన్నికల అధికారులు తొలగించారు. కానీ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

భారీగా నగదు పట్టివేత

భువనగిరి క్రైం: ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 15వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో భారీగా నగదు పట్టుకున్నట్లు భువనగిరి డీసీపీ రాజేష్‌చంద్ర సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల రోజుల్లో రూ.19,08,669 నగదు, 2,402 లీటర్ల మద్యం, 5.58 కేజీల గంజాయి పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఎవరైనా రూ.50వేలకు మించి నగదు తరలిస్తే సరైన ఆధారాలు చూపాలన్నారు. లేదంటే సీజ్‌ చేస్తామన్నారు. అక్రమంగా డబ్బులు, మద్యం తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గాయపడిన జింకకు వైద్యం చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ ఎల్లేష్‌
1/2

గాయపడిన జింకకు వైద్యం చేస్తున్న వెటర్నరీ అసిస్టెంట్‌ ఎల్లేష్‌

రాజేష్‌చంద్ర, భువనగిరి డీసీపీ
2/2

రాజేష్‌చంద్ర, భువనగిరి డీసీపీ

Advertisement
 

తప్పక చదవండి

Advertisement