షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Published Tue, Dec 26 2023 1:36 AM

- - Sakshi

అడవిదేవులపల్లి: షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన అడవిదేవులపల్లి మండలం జిలకరకుంటతండా గ్రామ పంచాయతీ పరిధిలోని హాంతండాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. హాంతండాకు చెందిన రమావత్‌ మత్రు ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఇల్లు మొత్తం పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడక బయటకు పరుగులు తీశాడు.

అప్పటికే మంటలు వ్యాపించడంతో వెంటనే అప్రమత్తమైన మత్రు ఇంట్లో ఉన్న సిలిండర్‌ను బయటకు విసిరేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని బీరువా, ఫ్రిడ్జ్‌, రూ.70వేల నగదు, దుస్తులు, బియ్యం, నిత్యావసర సరుకులు దగ్ధమయ్యాయి.

రూ.2లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న ఆర్‌ఐ ఠాగూర్‌ రామకృష్ణ సోమవారం హాంతండాకు చేరుకుని బాధితుడి ఇంటిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తానని ఆర్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement