వైభవంగా గంధం ఊరేగింపు | Sakshi
Sakshi News home page

వైభవంగా గంధం ఊరేగింపు

Published Sun, Dec 3 2023 1:30 AM

గంధాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న భక్తులు  
 - Sakshi

భువనగిరిటౌన్‌ : పట్టణంలోని దర్గా హజరత్‌ లాల్‌షా వలి బాబా రహెమతుల్లా అలై దర్గా గంధం ఊరేగింపు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాతె షరీఫ్‌ పఠిస్తూ ఫఖిర్‌ల విన్యాసాల మధ్య ఇస్లాంపూర మసీదు నుంచి పోస్టాఫీస్‌ సమద్‌ చౌరస్తా మీదుగా దర్గా వరకు ఊరేగింపు కొనసాగింది. భక్తులు దర్గాపై పూలచాదర్‌ సమర్పించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లి ఎండీ ఇంతియాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గంధం ఊరేగింపు ఘనంగా నిర్వహించామని, కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అహ్మద్‌ జమాల్‌ షరీఫ్‌, ఫారూఖి, సురేష్‌, రమ్మీబాయ్‌, రఫిఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement