బీఎల్‌ఆర్‌ గెలుపునకు కృషిచేయాలి | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఆర్‌ గెలుపునకు కృషిచేయాలి

Published Sun, Nov 12 2023 1:12 AM

చేయిచేయి కలిపి అభివాదం చేస్తున్న జానారెడ్డి, శంకర్‌నాయక్‌, బీఎల్‌ఆర్‌ తదితరులు - Sakshi

మిర్యాలగూడ: కాంగ్రెస్‌ పార్టీ మిర్యాలగూడ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) గెలుపునకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలని మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ అధ్యక్షతన శనివారం మిర్యాలగూడ పట్టణంలోని జేఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పీసీసీ ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్‌రెడ్డితో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నాయకులంతా వ్యక్తిగత ప్రాధాన్యతలు పక్కనపెట్టి పార్టీ అధిష్టానం నిర్ణయానికి కంకణబద్ధులై బీఎల్‌ఆర్‌ను గెలిపించుకుందామన్నారు. అనంతరం శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ బీఎల్‌ఆర్‌ విజయమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. బీఎల్‌ఆర్‌ మాట్లాడుతూ తాను ఎల్లప్పుడూ అందరివాడినేనని, ప్రతి కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేస్తానని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. అయితే నిన్నటి వరకు వేరు కుంపటిగా ఉన్న నాయలకులంతా ఒకే వేదికపై చేయిచేయి కలిపి ఐక్యతారాగం చాటడంతో కార్యకర్తలు, నాయకుల హర్షధ్వానాలతో ఫంక్షన్‌హాల్‌ మారుమోగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్‌రెడ్డి, నాయకులు తలకొప్పుల సైదులు, పగిడి రామలింగ్యయాదవ్‌, చిరుమర్రి కృష్ణయ్య, పొదిల శ్రీనివాస్‌, కాకునూరి బసవయ్యగౌడ్‌, బొంగరాల కిరణ్‌, మెరుగు శ్రీనివాస్‌, ఎంఏ.సలీం, మాలి కాంతారెడ్డి, గాజుల శ్రీనివాస్‌, కందుల నరసింహారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement