ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

Published Sun, Nov 12 2023 1:12 AM

సమీక్ష సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఎన్నికల పరిశీలకులు, కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్‌ - Sakshi

నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించేలా జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం, అవినాష్‌ చంపావత్‌, ఆర్‌.కన్నన్‌, వ్యయ పరిశీలకులు సతీష్‌ గురుమూర్తి, డీఎం.నిమ్జే, సంతోష్‌ కుమార్‌, పోలీస్‌ పరిశీలకులు విజయ్‌సింగ్‌ మీనా, వినీత్‌ ఖన్నా సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, ఎస్పీ అపూర్వరావు, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం కరపత్రాలు ముద్రణ చేసేప్పుడు పబ్లిషర్‌, ప్రింటర్‌ నిబంధనలు పాటించాలని, మెటీరియల్‌ పంపిణీ, ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఉపయోగించే విధానంపై పోలింగ్‌ సిబ్బందికి శిక్షణా ద్వారా అవగాహన కల్పించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార నిమిత్తం వాహనాలు, ర్యాలీలు, సమావేశాలు, మైకులకు రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. శబ్ద కాలుష్యం లేకుండా పోలీస్‌లు మానిటర్‌ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా పరిశీలకులకు వివరించారు. ఎన్నికలకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు మాట్లాడుతూ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో ఆర్వో ఆఫీసుల వద్ద అవసరమైన పోలీస్‌ బందోబస్తుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

ఫ ఎన్నికల సాధారణ, వ్యయ, పోలీస్‌ పరిశీలకులు

కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాట్ల పరిశీలన

సమావేశం అనంతరం కేంద్ర ఎన్నికల పరిశీలకులు కలెక్టర్‌తో కలిసి తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ హాళ్లు, స్ట్రాంగ్‌రూంలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ను అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పరిశీలకులతోపాటు కలెక్టర్‌, ఎస్పీ, పీఆర్‌ ఎస్‌ఈ తిరుపతయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ చంద్రమోహన్‌, సర్వే ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాసులు, డీపీఆర్‌ఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకుంటున్న ఎన్నికల పరిశీలకులు
1/1

కౌంటింగ్‌ కేంద్రంలో కలెక్టర్‌ను అడిగి వివరాలు తెలుసుకుంటున్న ఎన్నికల పరిశీలకులు

Advertisement
 
Advertisement
 
Advertisement