వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా | - | Sakshi
Sakshi News home page

వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా

Dec 2 2025 9:31 AM | Updated on Dec 2 2025 9:31 AM

వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా

వడ్డించేది నేనే.. ఎన్ని నిధులైనా ఇస్తా

ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పదేళ్లలో వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసుకుందాం

అభివృద్ధిలో దేశంలోనే పాలమూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చాక కూడా జిల్లాను ఎవరూ పట్టించుకోలేదు

మక్తల్‌, అత్మకూర్‌ పురపాలికల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/నారాయణపేట/ మక్తల్‌: ‘పాలమూరు జిల్లాకు వేల కోట్ల నిధులు ఇస్తున్నాం. వడ్డించేది నేనే. ఎన్ని నిధులైనా ఇస్తా. పాలమూరు పచ్చబడాలే. అభివృద్ధిలో దేశంలోనే పాలమూరు జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాను ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పదేళ్లలో పాలమూరును వందేళ్ల కు సరిపడా అభివృద్ధిని చేసుకుందాం.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన–ప్రజా విజయోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఏర్పాటు చేసిన తొలి బహిరంగసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సోమవారం మధ్యాహ్నం 2.25 గంటలకు వనపర్తి జిల్లా ఆత్మకూరు చేరుకున్న సీఎంకు అక్కడ భారీ స్వాగతం పలికారు. పీజేపీ క్యాంపు వద్ద ఆత్మకూరు పురపాలికలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మధ్యా హ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో మక్తల్‌కు బయల్దేరారు. మంత్రులు వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహతో కలిసి మక్తల్‌లోని పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశా రు. అక్కడి నుంచి సభా వేదిక వద్దకు చేరుకుని రూ. 1,038 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా విజయోత్సవాల సభలో సీఎం ప్రసంగించారు.

సాగుతో పాటు విద్యారంగానికి ప్రాధాన్యత

‘సాగుతో పాటు విద్యారంగానికి కూడా ప్రాధాన్యత కింద తీసుకున్నాం. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని గుర్తించాం. ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ నిర్మించుకుంటున్నాం. రూ.220 కోట్లతో రెసిడెన్షియల్‌ పనులు చేపడుతున్నాం. పార్టీలు, జెండాలు, ఏజెండా చూసుకోకుండా ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను మంజూరు చేశాం. జడ్చర్ల–దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ మధ్యలో ఐఐఐటీని ప్రారంభించుకున్నాం. పీయూలో లా, ఇంజనీరింగ్‌ కళాశాలలు మంజూరు చేసుకున్నాం.’ అని సీఎం పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement