రాష్ట్రంలోనే మొదటిస్థానం..
ఐదేళ్లతో పోల్చితే నిరక్షరాస్యులు, మధ్యలో చదువు మానివేసిన వారిని గుర్తించి.. కలెక్టర్, డీఈఓ ఆదేశాల మేరకు అడ్మిషన్లు పెంచాం. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా మిగతా జిల్లాలతో పోల్చితే రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉంది. అడ్మిషన్లు చేరిన వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాం. – శివయ్య,
ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్
చక్కని అవకాశం..
వివిధ కారణాలతో బడిమానివేసిన విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ, ఇంటర్ చదువుకునేందుకు ఒక చక్కని అవకాశం. అడ్మిషన్లు గతంలో కంటే చాలా పెరిగాయి. ఓపెన్ స్కూల్‌లో ఎస్సెస్సీ వంటివి రెగ్యులర్ తరగతుల కంటే కూడా సరళంగా ఉంటాయి. సలువుగా పాస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో అక్షరాస్యత పెరుగుతుంది.
– ప్రవీణ్‌కుమార్, డీఈఓ, మహబూబ్‌నగర్
●
రాష్ట్రంలోనే మొదటిస్థానం..


