స్వయం పాలనకు దూరం
హైకోర్టులో పిల్ వేసేందుకు సన్నద్ధం..
ఈసారి ఎన్నికల్లోనూ..
పంచాయతీ ఎన్నికలకు నోచుకోని ఏజెన్సీ గ్రామాలు
●
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆ గ్రామాల్లో ఒక్కరు కూడా ఎస్టీలు లేరు. కానీ గ్రామ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ మాత్రం ఎస్టీ వర్గానికి రిజర్వు అయ్యింది. ఫలితంగా ఈసారి కూడా సర్పంచులు లేని గ్రామాలుగా మిగిలిపోనున్నాయి. అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, కుమ్మరోనిపల్లి, ప్రశాంత్‌నగర్, లక్ష్మాపురం, వంగురోనిపల్లి గ్రామాలు స్వయం పాలనకు నోచుకోవడం లేదు. గ్రామంలో ఎస్టీలు లేకపోవడంతో గత పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి సైతం ఇదే పరిస్థితి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఐదేళ్లపాటు ‘ప్రత్యేక’ పాలనలోనే..
అమ్రాబాద్ మండలంలోని కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, లక్ష్మాపూర్, కుమ్మరోనిపల్లి, ప్రశాంత్‌నగర్ గ్రామాలు 2018లో కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. 2019లో నిర్వహించిన మొదటి సాధారణ ఎన్నికల్లో ఆయా గ్రామాలు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే ఈ ఐదు గ్రామాల్లో ఒక్కరు కూడా ఎస్టీ కుటుంబాలకు చెందిన వారు లేరు. రిజర్వేషన్లు మార్చాలని అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎన్నికలను బహిష్కరిస్తామని తెగేసి చెప్పినా ఫలితం లేకపోయింది. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉండటంతో తాము చేసేదేమీ లేదని అధికారులు చేతులెత్తేశారు. ఫలితంగా గత పంచాయతీ పోరులో పోటీచేసే అభ్యర్థులు లేక ఎన్నికలు నిర్వహించలేదు. ఈ ఐదు గ్రామాలకు సర్పంచులు లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. అయితే సదరు అధికారులకు అప్పటికే ఇతర శాఖల బాధ్యతలు ఉండటంతో గ్రామాల్లో పర్యవేక్షణ కొరవడింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండక.. సర్పంచ్ పదవులకు నోచుకోక ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏజెన్సీ ఏరియా కావడంతో..
అమ్రాబాద్ మండలంలో మొత్తం 20 గ్రామపంచాయతీలు ఉండగా.. వీటిలో తుర్కపల్లి మినహా మిగతా గ్రామాలన్నీ ఏజెన్సీ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో 19 గ్రామాల సర్పంచ్ స్థానాలను ఎస్టీలకు కేటాయించారు. వీటిలో ఐదు గ్రామాల్లో ఎస్టీ జనాభా ఒక్కరు కూడా లేకున్నా ఇదే రిజర్వేషన్ కొనసాగుతోంది. రిజర్వేషన్ మార్చాలని ఏళ్లుగా గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో కుమ్మరోనిపల్లికి అనుబంధంగా ఉన్న వంగురోనిపల్లి కొత్తగా జీపీ అయ్యింది. ఈ గ్రామంలో సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డులు ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. అయితే ఎస్టీలు లేకున్నా రిజర్వు కావడంతో ఎన్నికలను బహిష్కరిస్తామని గత ఎన్నికల సందర్భంగా గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు.
ఇటీవల మద్యం దుకాణాలు సొంతం చేసుకున్న లైసెన్స్‌దారులకు రూ.లక్షలు ముట్టజెప్పి దుకాణాలు సొంతం చేసుకున్నారు కొందరు సిండికేట్ వ్యాపారులు. కోయిలకొండ దుకాణానికి ఏకంగా ఏకంగా రూ.1.50 కోట్ల గుడ్‌విల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాగా డిమాండ్ ఉన్న దుకాణాలకు అయితే రూ.లక్షల్లో గుడ్‌విల్‌తోపాటు వ్యాపారంలో వాటాలు ఇచ్చినట్లు సమాచారం. మొత్తంగా మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. లక్కీడ్రా తీసినా బినామీ పేర్లతో దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మరికొన్ని చోట్ల ఇతరులకు దుకాణాలు వచ్చినా గుడ్‌విల్ ఇస్తామంటూ బేరసారాలు చేసి రూ.లక్షల్లో ముట్టజెప్పి దుకాణాలు కై వసం చేసుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్టోబర్ 27న మద్యం దుకాణాలకు లక్కీడిప్ తీసిన నాటి నుంచి ప్రత్యేక పథకాలు, పావులు కదిపి లిక్కర్ కింగ్‌లు పైచేయి సాధించారు. మద్యం వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటే ఇంత పోటీ ఉంటుందనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
జిల్లా మొత్తం దరఖాస్తులు ఫీజు
దుకాణాలు (రూ.కోట్లలో..)
మహబూబ్‌నగర్ 54 1,634 49.02
నాగర్‌కర్నూల్ 67 1,518 45.54
నారాయణపేట 36 853 25.59
జోగుళాంబ గద్వాల 34 774 23.22
వనపర్తి 36 757 22.71
అమ్రాబాద్ మండలంలోని
ఐదు జీపీల్లో ఎస్టీ రిజర్వు
ఎస్టీలు ఎవరూ లేక
పోటీచేయలేని దుస్థితి
గత ఐదేళ్లు సర్పంచులు లేకుండానే ముగిసిన వైనం
ఈసారి సైతం అదే తీరు
గత పంచాయతీ ఎన్నికల నుంచి పదవీకాలం పూర్తయ్యేవరకు సర్పంచులు లేకుండానే గడిచిన ఈ గ్రామాల్లో.. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగనుంది. ఆయా గ్రామాల్లో ఎస్టీలు ఎవరూ లేకపోయినా ఇదే రిజర్వేషన్ కొనసాగితే.. ఇక ఎప్పటికీ గ్రామాలకు సర్పంచులు ఉండరన్న ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. సర్పంచులు లేకపోవడంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని.. అభివృద్ధి పనుల ఊసే ఉండటం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ మార్చాలని అధికారులను కోరుతున్నారు.
ఆయా గ్రామాల సర్పంచ్ స్థానాలతో పాటు రిజర్వు అయిన వార్డు స్థానాల్లో పోటీచేసేందుకు ఎవరూ లేక నామినేషన్లు దాఖలు కావడం లేదు. దీంతో రిజర్వేషన్ల తీరును నిరసిస్తూ రిజర్వు కాని వార్డు స్థానాల్లో కూడా ఎవరూ పోటీచేయడం లేదు. ఫలితంగా ఆయా గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించేందుకు ఆయా గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
స్వయం పాలనకు దూరం


