సర్పంచ్ 103, వార్డు స్థానాలకు 95
● రెండో విడత
పంచాయతీ పోరుకు భారీగా నామినేషన్లు
● 2వ తేదీ వరకు గడువు
సాక్షి, నాగర్‌కర్నూల్: రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఏడు మండలాల పరిధిలోని 151 సర్పంచ్ స్థానాలతో పాటు 1,412 వార్డు స్థానాలకు ఆదివారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట మండలాల్లో మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 103, వార్డు స్థానాలకు 95 నామినేషన్లు దాఖలయ్యాయి. 2వ తేదీన రెండో విడత నామినేషన్లకు గడువు ముగియనుంది.
తొలి విడత నామినేషన్ల పరిశీలన పూర్తి..
తొలి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి, ఊర్కొండ, వంగూరు, వెల్దండ మండలాల్లో దాఖలైన నామినేషన్లను అధికారులు ఖరారుచేశారు. సర్పంచ్‌కు 958, వార్డు స్థానాలకు 3,373 నామినేషన్లు ఖరారయ్యాయి. సర్పంచ్ స్థానాలకు కల్వకుర్తి మండలంలో 153, తాడూరులో 158, తెలకపల్లిలో 192, ఊర్కొండలో 91, వంగూరులో 188, వెల్దండలో 176 నామినేషన్లను అర్హత కలిగినవిగా తేల్చారు. వార్డు స్థానాలకు సంబంధించి కల్వకుర్తిలో 603, తాడూరులో 537, తెలకపల్లిలో 633, ఊర్కొండలో 380, వంగూరులో 547, వెల్దండలో 673 నామినేషన్లను అధికారులు ఖరారుచేశారు.
రెండో విడత ఎన్నికలకు దాఖలైన
నామినేషన్లు ఇలా..
మండలం సర్పంచ్ వార్డు
స్థానాలు
బిజినేపల్లి 28 33
కోడేరు 14 2
కొల్లాపూర్ 6 2
నాగర్‌కర్నూల్ 16 26
పెద్దకొత్తపల్లి 28 5
పెంట్లవెల్లి 6 8
తిమ్మాజిపేట 26 19


