చిన్నారులకు మిల్క్
జిల్లాలోని అంగన్‌వాడీ సెంటర్లు, చిన్నారుల వివరాలు
ప్రాజెక్టులు సెంటర్లు చిన్నారులు
ములుగు 142 2,536
ఎస్‌ఎస్ తాడ్వాయి 124 1,430
వెంకటాపురం(కె) 168 1,624
ఏటూరునాగారం 206 2,683
అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకు పంపిణీ
ఏటూరునాగారం: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు చిక్కటి పాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఈ మేరకు గత నెల 17వ తేదీన పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు రోజుకూ 100 ఎంఎల్ చిక్కటి పాలను అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 549 ప్రధాన అంగన్‌వాడీ సెంటర్లు ఉండగా 91 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల పిల్లలు 8,273 మంది ఉండగా ఈ పథకం ద్వారా పాలను అందిస్తున్నారు. దీంతో పేద కుటుంబాలకు చెందిన పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా సెంటర్ల నిర్వహకులు చూస్తున్నారు. ఈ పాల పథకం అమలుపై చిన్నారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాలు అందుతున్నాయి..
ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రంలో 100 ఎంఎల్ పాలు ఇస్తున్నారు. రోజు అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకొచ్చి వదిలిపెడితే పిల్ల లకు టీచర్లు పాలు ఇవ్వడంతో పాటు ఆటపాటలతో విద్యాబోధన చేస్తున్నారు. దీనివల్ల ఏజెన్సీ గ్రామాల్లోని పిల్లలకు మరింత మేలు జరుగుతుంది. పిల్లలు కూడా అంగన్‌వాడీ బడికి రావడానికి ఇష్టపడుతున్నారు.
– ఎట్టి మానస, చిన్నబోయినపల్లి, తల్లి
పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
గత నెల 17న లాంఛనంగా పథకాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
జిల్లాలో 8,273 మంది చిన్నారులు
చిన్నారులకు మిల్క్
చిన్నారులకు మిల్క్
చిన్నారులకు మిల్క్


