సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు

Dec 7 2025 7:21 AM | Updated on Dec 7 2025 7:21 AM

సోమేశ

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు

పాలకుర్తి టౌన్‌: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం ములుగు కలెక్టర్‌ టీఎస్‌ దివాకర దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ దంపతులను స్వామి వారి శేషవస్త్రాలతో సన్మానించి స్వామి వారి ప్రసాదం అందించారు. ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న, అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డీవీఆర్‌శర్మ, దేవగిరి అనిల్‌కుమార్‌, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

రామప్పలో ఎన్నికల పరిశీలకుడు

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హనుమకొండ జిల్లా ఎన్నికల పరిశీలకుడు శివకుమార్‌ నాయుడు సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట తహసీల్దార్‌ గిరిబాబు, ఎస్సై చల్లా రాజు ఉన్నారు.

‘అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కాంగ్రెస్‌’

ములుగు రూరల్‌: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్‌ నరేశ్‌ ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్ధుల విజయం కోసం పోటీదారులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరికొండ బలరామ్‌, చింతలపూడి భాస్కర్‌ రెడ్డి, రమేష్‌, రవీంద్రచారి, సురేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ సేవలు

మరువలేనివి

ఏటూరునాగారం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి అందించిన సేవలు మరువలేనివని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. అంబేడ్కర్‌ వర్ధంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని 6వ వార్డులో గల అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ ఆశయాలను యువత కొనసాగించాలన్నారు. యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థాయికి చేరుకుంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సునీల్‌, చిన్ని కృష్ణ, వలిబాబా, ఖాజాపాషా పాల్గొన్నారు.

భక్తుల రద్దీ

మంగపేట: మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు, అర్చనలు జరపించారు.

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు
1
1/4

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు
2
2/4

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు
3
3/4

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు
4
4/4

సోమేశ్వరాలయంలో ములుగు కలెక్టర్‌ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement