● 32 వార్డులకు
ఒక్కో దరఖాస్తుతో ఏకగ్రీవం..
గోవిందరావుపేట: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 18 గ్రామ పంచాయతీలు ఉండగా 154 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 32 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. ఆరు వార్డుల్లో ఒక్క నామినేషన్ రాలేదు దీంతో ఎలాంటి ఓటింగ్ అవసరం లేకుండానే వారిని ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ రోజున విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది.
నామినేషన్లు రాకపోవడంతో
తిరిగి ఎన్నికలు తప్పవా?
మండలంలోని ఆరు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థుల ఎంపికలో విభేదాలు, కమ్యూనిటీ స్థాయి సమీకరణాలు, స్థానిక వర్గాల మధ్య అనుసంధానం వంటి కారణాలతో ఆయా వార్డుల్లో పోటీకి ఎవరూ ముందుకు రాలేకపోయినట్లు సమాచారం. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ దాఖలు కానీ ఆరు వార్డులకు తొలిదశ ఎన్నికలు పూర్తయిన తర్వాత మరోసారి నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మండలంలో గ్రామ పంచాయతీ రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఏకగ్రీవాల ప్రభావం, ఖాళీగా ఉన్న వార్డుల పున:ఎన్నికలు, మిగతా వార్డుల్లో జరగనున్న పోటీ మొత్తం ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తాయోననే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.
ఆరు వార్డులకు నామినేషన్లు నిల్..!


