సర్పంచ్ 18.. వార్డులకు 37
రెండో విడత నామినేషన్లు ప్రారంభం
ములుగు రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ములుగు, మల్లంపల్లి, వెంకటాపురం(ఎం) మండలాల్లో ప్రారంభమైంది. వెంకటాపురం (ఎం) మండలంలో సర్పంచ్ స్థానానికి–9, ములుగు మండలంలో 4, మల్లంపల్లి–5 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం సర్పంచ్ నామినేషన్లు–18, వార్డు సభ్యుల నామినేషన్లు–37 దాఖలు చేశారు. మరో రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.
వాహనాల తనిఖీ
ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలోని 163 జాతీయ రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా సోదా చేసి పంపించారు. ప్రయాణికులు, డ్రైవర్ల వివరాలను తెలుసుకున్నారు. అలాగే మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఇతర వస్తువులు సరఫరా అవుతున్నాయా అని ఆరా తీస్తున్నారు.
రాష్ట్ర స్థాయికి ఎంపిక
కాళేశ్వరం: మహదేవపూర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వెలగందుల తరుణి 6వ తరగతి, వెలగందుల తణ్మయి 8వ తరగతి విద్యార్థులు వీవీఎం (విద్యార్థి విజ్ఞాన్ మంథన్) పరీక్షకు రాష్ట్రస్థాయి ఎంపికై నట్లు జిల్లా వీవీఎం కోఆర్డినేటర్, పాఠశాల ఫిజికల్ సైన్స్ టీచర్ మడక మధు ఆదివారం తెలిపారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పరీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నందుకు పాఠశాల హెచ్‌ఎం జి.శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు సరిత, సుధారాణి, సరితాదేవి, వలిపాషా, శ్రీనివాస్, రజిత, లీలారాణి, సమ్మయ్య, వీరేశం, దీపిక, వసుధప్రియా, ప్రసూన, సాహెదాబేగం, పూర్ణిమ, అజ్మాత్‌పాషా, ఆంజనేయులు విద్యార్థులను అభినందించారు.
తరుణి తన్మయి
సర్పంచ్ 18.. వార్డులకు 37
సర్పంచ్ 18.. వార్డులకు 37
సర్పంచ్ 18.. వార్డులకు 37


