స్కూల్ వ్యాన్ డ్రైవర్ల వేతనాలు పెంచాలి
భూపాలపల్లి అర్బన్: స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, క్లీనర్ల వేతనాలు పెంచాలని భూపాలపల్లి పట్టణ అఖిల పక్ష పార్టీల నాయకులు, విద్యార్థి యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ది కాకతీయ ప్రైవేట్ స్కూల్స్ వ్యాన్ డ్రైవర్స్, క్లీనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ, డీఎస్పీ, టీఆర్‌పీ, ఏఐటీయూసీ, విద్యార్థి యువజన సంఘాలు ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ పార్టీలు, సంఘాల నాయకులు సోత్కు ప్రవీణ్‌కుమార్, రాజేందర్, గీసా సంపత్, సతీష్, రవీందర్, రవిపటేల్, వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, సురేష్ మాట్లాడారు. ది కాకతీయ స్కూల్ వ్యాన్ డ్రైవర్ క్లీనర్ అసోసియేషన్ మూడు డిమాండ్లతో ఒక రోజు సమ్మె చేపట్టినట్లు తెలిపారు. డ్రైవర్ వేతనం నెలకు రూ.20వేలు, క్లీనర్ వేతనం రూ.10వేలు, 12 నెలల జీతం చెల్లించాలని, ఇద్దరు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కోరారు. ఈ డిమాండ్లతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం (ట్రస్మా) దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాలేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజులు పెంచుతూ యాజమాన్యం లాభాల్లో ఉన్నప్పటికీ డ్రైవర్లకు, క్లీనర్లకు జీతాలు పెంచకపోవడం చాలా దారుణమన్నారు. సమ్మెకు అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాల మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ది కాకతీయ ప్రైవేట్ స్కూల్ వ్యాన్స్, క్లీనర్ అసోసియేషన్ నాయకులు నాతరి ప్రదీప్, పువ్వాడ రాంబాబు, జైద నర్సింగ్, మీసాల శ్రీనివాస్, జైద మధు, బొల్లపల్లి అశోక్, ఓరిగంటి కిరణ్, ఎండీ షఫీ, నేలి మొగిలి, దుబ్బాక సందీప్ పాల్గొన్నారు.
ఒక రోజు సమ్మె


