ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
● ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి
● కలెక్టర్ దివాకర టీఎస్
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించిన గంట సోమయ్య కాంగ్రెస్ పార్టీ నుంచి 1981–1994 వరకు సర్పంచ్‌గా ప్రజలకు విశిష్ట సేవలందించారు. చివరకు తనకున్న ఆస్తినంతా ప్రజా సేవకు ధారపోశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వావిలాల గ్రామానికి రప్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి బస్సు సర్వీసులు నడిపించారు. గ్రామంలో 13 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. ప్రధాని రాజీవ్‌గాంధీ చేతుల మీదుగా ఉత్తమ సర్చంచ్‌గా పురస్కారం అవార్డు, ప్రశంసపత్రం అందుకున్నారు. గ్రామంలో టెలిఫోన్ ఎక్చేంజ్, విద్యుత్ సబ్‌సేష్టన్ మంజూరు చేయించారు. 1991 ఆగస్టు 19న సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ నాగన్న దళం సర్పంచ్ సోమయ్యను కిడ్నాప్ చేయడంతో అప్పటి కలెక్టర్ బీపీ ఆచార్య చొరవతో నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యారు. 2021లో కన్నుమూశారు. గ్రామ ప్రజలు ఆయన సేవలకు గుర్తుగా 2022 ఏప్రిల్‌లో వావిలాల ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేశారు.
దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్‌ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలో లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్టించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు.
ఎన్నికల ‘కిక్కు’
పదవులకు వేలం వేస్తే చర్యలు
ఆస్తిని ధారపోశారు.. ప్రజల గుండెల్లో నిలిచారు
ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..


