తొలి సర్పంచ్ కందుకూరి కాంతయ్య
హసన్‌పర్తి: హనుమకొండ మండలం గోపాలపురానికి చెందిన కందుకూరి కాంతయ్య గ్రామానికి తొలి సర్పంచ్. 1979 నుంచి 1995 వరకు వరుసగా 17 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. హనుమకొండ సమితి డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, ఏనుమాముల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, వరంగల్ కో–ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా పదవులు నిర్వర్తించారు. మాజీ మంత్రి హయగ్రీవాచారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. 1999లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద కాంతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా కాంతయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంతయ్య స్ఫూర్తితో ఆయన కుటుంబీకులు రాజకీయంలో రాణిస్తున్నారు.


