మోహన్‌రావుది వీర మరణం!
టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్(వి) గ్రామానికి చెందిన లింగంపల్లి మోహన్‌రావు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సేవలందించారు. సొంత ఖర్చులతో రోడ్ల విస్తరణ, సబ్‌స్టేషన్ ఏర్పాటు రోడ్లు, డ్రెయినేజీ, నీటి వసతి ఇలా అనేక సేవలందించారు. సర్పంచ్‌గా కొనసాగుతున్న సమయంలోనే 2009లో మావోయిస్టులో చేతిలో హతమయ్యారు. దాంతో ఆయన అభివృద్ధ్దికి గుర్తుగా గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనది వీరమరణమని ఇప్పటికీ స్థానికులు చెప్పుకుంటారు..


