సర్పంచ్‌లకు 275.. వార్డులకు 913 దాఖలు
ముగిసిన మొదటి దశ నామినేషన్లు
ఏటూరునాగారం: గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్లు శనివారంతో ముగిశాయి. జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఇతర పార్టీల నాయకులు రెండు మూడు సెట్లతో కూడిన నామినేషన్లను అందజేశారు. నేడు స్రూటినీ చేయనున్నారు. 3వ తేదీన ఉపసంహరణల అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు.
ఏ మండలంలో ఎన్ని నామినేషన్లు..
ఏటూరునాగారం మండలంలో సర్పంచ్‌కు 75, వార్డు సభ్యులకు 266, తాడ్వాయి మండలంలో సర్పంచ్‌కు 111, వార్డు సభ్యులకు 280, గోవిందరావుపేట మండలంలో సర్పంచ్‌కు 89, వార్డుసభ్యులకు 367 నామినేషన్లు దాఖలు చేశారు.


