నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు.


