కేసీఆర్ పట్టుదలతోనే ప్రత్యేక రాష్ట్రం
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
లక్ష్మీనర్సింహారావు
ఏటూరునాగారం : ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, అనేక మంది అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం, జయశంకర్ విగ్రహం ఎదుట దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ అనేక ఉద్యమాలు చేశారన్నారు. ఎంతోమంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్నట్లు చెప్పారు. నిధులు, నీళ్లు, నియమాకాలను సాధించుకునే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. అనంతరం తొలి ఉద్యమకారులను లక్ష్మీనర్సింహరావు ఘనంగా సన్మానించారు. పార్టీ మండల అధ్యక్షుడు గడదాసు సునీల్‌కుమార్, సమ్మయ్య, నగేష్, కృష్ణ, వలిబాబు, మల్లారెడ్డి, నూతి కృష్ణ, సర్దార్, సమ్మయ్య, ముత్తయ్య, స్వరూప, ముత్తేష్ తదితరులు పాల్గొన్నారు.


