విద్యార్థులు శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి
ఏటూరునాగారం: విద్యార్థులు శాసీ్త్రయ అవగాహన పెంచుకోవాలని ములుగు ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ జిల్లా స్థాయి పరీక్ష పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని, సైన్స్‌ను జీవితంలో అన్వయించుకోవాలన్నారు. ప్రస్తుతం ఆకస్మిక గుండెపోటు మరణాలు అధికంగా ఉన్నాయని, ప్రతిఒక్కరూ సీపీఆర్ చేయడం నేర్చుకోవాలన్నారు. చెకుముకి పరీక్షలకు జిల్లా నలుమూలల నుంచి 40 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తెలుగు విభాగం నుంచి జెడ్పీహెచ్‌ఎస్ అలుబాక, ఇంగ్లిష్ విభాగం నుంచి జెడ్పీహెచ్‌ఎస్ ఏటూరునాగారం, పైవేట్ స్కూల్స్ విభాగం నుంచి గోవిందరావుపేట మెరిట్ స్కూల్, టీజీఎంఎస్ బండారుపల్లి రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు అర్హత సాధించారు. కరీంనగర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్, కలకొట్ల నరేష్, పల్లె నాగరాజు, మహిళా సమత సొసైటీ కన్వీనర్ యమున, అనిత, రేవతి, వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు ఆస్పత్రి సూపరింటెండెంట్
చంద్రశేఖర్


