నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచొద్దు
ములుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచొద్దని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషనన్‌తో పాటు ఇద్దరు సాక్షులతో సెల్ఫ్ డిక్లరేషన్ దాఖలు, ఎవరైనా అభ్యర్థి నామినేషన్‌తో పాటు సెల్ఫ్ డిక్లరేషనన్ దాఖలు చేయడంలో విఫలమైతే, అతను/ఆమె దానిని నామినేషన్ వేసే చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు దాఖలు చేయాలన్నారు. డిక్లరేషన్ కోసం అఫిడవిట్ కానీ, నోటరీ కానీ అవసరం లేదన్నారు. అన్ని నిలువు వరుసలను పూరించాలని, ఏ కాలమ్‌ను ఖాళీగా ఉంచొద్దన్నారు. ఏదైనా వస్తువుకు సంబంధించి సమాచారం లేకుంటే, సందర్భానుసారంగా ‘నిల్’ లేదా ‘వర్తించదు’ అని పేర్కొనాలన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి నూతన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం జత చేయాలి. సర్పంచ్, వార్డు మెంబర్ సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నామినేషన్ వేసే అభ్యర్థులు ఈ సూచనలు తప్పక పాటించాలన్నారు.
జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్


