శనివారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
గ్రామ ప్రథమ పౌరుడి హోదా దక్కించుకునేందుకు ఇప్పటినుండే వివిధ రాజకీయ పార్టీల నుంచి చోటా, బడా నేతలు పోటీ పడుతున్నారు. పార్టీ పరంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉండనప్పటికీ గెలుపే ధ్యేయంగా ఇప్పటినుంచే గ్రూపులను ఒక్కటి చేస్తూ ఎన్నికల్లో గెలుపొందేందుకు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం మండల పరిషత్ ఎన్నికలు ముందుగా జరిపి పంచాయతీ ఎన్నికలు తర్వాత జరపాలని ఆలోచించింది. మారిన సమీకరణాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు తొలుత రావడంతో సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయినా.. ఆ సానుభూతితో మండల పరిషత్ ఎన్నికల్లో గెలవవచ్చనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు.


