కొనసాగిన నామినేషన్ ప్రక్రియ
ఏటూరునాగారం/గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో మొదటి దశలో ఏటూరునాగారం, తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నామినేషన్ల పర్వం రెండో రోజు కొనసాగింది. శుక్రవారం సర్పంచ్ పోటీ కోసం 41 మంది, వార్డు సభ్యుల కోసం 72 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ తెలిపారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి కేవలం ముగ్గురు వ్యక్తులను మాత్రమే నామినేషన్‌కు అనుమతి ఇచ్చారు. జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు సతీమణి శ్రీలత ఏటూరునాగారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కాగా ఇప్పటి వరకు మూడు మండలాల్లో సర్పంచ్‌లకు 63, వార్డులకు 92 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా అసిస్టెంట్ ఎన్నికల అధికారులు నిత్యం పర్యవేక్షణ చేశారు.
సర్పంచ్ 41, వార్డు సభ్యులకు 72 నామినేషన్లు దాఖలు
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
మండలం సర్పంచ్ వార్డులు
ఏటూరునాగారం 16 6
గోవిందరావుపేట 8 29
తాడ్వాయి 17 37
మొత్తం 41 72


