చిచ్చు పెడుతున్న ఇసుక ర్యాంప్‌లు
వెంకటాపురం(కె): మండలంలోని ఇసుక ర్యాంప్‌లు గిరిజనులు, గిరిజనేతులకు మధ్య చిచ్చు పెడుతున్నాయి. మండల పరిధిలోని అబ్బాయిగూడెంలోని ఓ ఇసుక ర్యాంప్‌తో గిరిజనులు, గిరిజనేతరులకు మధ్య గొడవలు జరుగుతుండటంతో వారం రోజు లుగా గ్రామంలో రిలే దీక్షలు చేస్తున్నారు. శుక్రవా రం పంట పొలాల నుంచి రహదారి పోవడంతో పంటలు నష్టపోతున్నామని ఆందోళన చేస్తున్నారు. పంట పొలానికి దుమ్ము పడకుండా కంచెను ఏర్పా టు చేయగా ఇసుక సొసైటీ సభ్యులు కూల్చారు. దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మన్నేటి ధనలక్ష్మి అనే మహిళపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారితో మాట్లాడారు. అయినా వినకపోవడంతో విషయాన్ని టీఎండీసీ పీఓ విష్ణువర్ధన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక రీచ్ పనులు నిలిపేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా అబ్బాయిగూడెం ఇసుక రీచ్‌తో పంటలు నష్టపోతున్నామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణ
మహిళలకు గాయాలు
పురుగుమందు డబ్బాలతో
ధర్నాకు దిగిన గ్రామస్తులు


