వేస్ట్ వస్తువులతో ఆదాయం
ములుగు: ఇంటి పరిసరాల్లో ఏర్పడే చెత్త (వేస్ట్)తో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్‌జీసీ అధికారి విద్యాసాగర్ తెలిపారు. శుక్రవారం ములుగు బాలికల ఉన్నత పాఠశాలలో శ్రీవేస్ట్ టు వెల్త్ఙ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లాలోని సుమారు 30 పాఠశాలల విద్యార్థులు వేస్ట్ పదార్థాలతో పనికి వచ్చే వాటితో పాటు ఇంటిలో అలంకరణకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ పరిసరాల్లో ఇంట్లో ఏర్పడే చెత్త నుంచి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేసి పర్యావరణాన్ని కాపాడాలని, పొల్యుషన్‌ను తగ్గించాలన్నారు. పైగా ఆదాయం కూడా సంపాదించవచ్చన్నారు. ఎగ్జిబిషన్‌లో మొదటి బహుమతి బండారుపల్లి గురుకుల పాఠశాల, ద్వితీయ బహుమతి పస్రా ఉన్నత పాఠశాల, తృతీయ బహుమతి ములుగు మైనార్టీ పాఠశాల విద్యార్థులు నిలిచారు. వీరిని ప్రశంసతో పాటు నగదును అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్, హెచ్‌ఓం పుష్ప తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్


